లెబనీస్ అధ్యక్షుడితో సమావేశమైన పోప్ లియో

జూన్ 13 శుక్రవారం ఉదయం అపోస్టోలిక్ ప్యాలెస్‌లో లెబనాన్ అధ్యక్షుడు Joseph Aounను వ్యక్తిగతంగా పోప్ లియో కలిసారు.

పోప్‌తో సమావేశం తర్వాత  అధ్యక్షుడు Joseph వాటికన్  విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్, ఆయనతో పాటు రాష్ట్రాలతో సంబంధాల అండర్-సెక్రటరీ మొన్సిగ్నోర్ Mirosław ని కూడా కలిసారని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

"స్టేట్ సెక్రటేరియట్‌లో జరిగిన స్నేహపూర్వక చర్చలలో భాగంగా ఇరు దేశాల మధ్య  ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రస్తావించబడింది, లెబనీస్ సమాజంలో కథోలిక శ్రీసభ సంప్రదాయ మరియు స్థిరమైన పాత్రకు ప్రత్యేక ప్రశంసలు వ్యక్తమయ్యాయి."

స్థిరీకరణ మరియు సంస్కరణ ప్రక్రియ ద్వారా దేశ రాజకీయ సామరస్యం మరియు ఆర్థిక పునరుద్ధరణకు మార్గం సులభతరం అవుతుందని వారి సంభాషణ కొనసాగింది.

ముగింపులో మధ్యప్రాచ్యంలో  శాంతిని పెంపొందించడానికి అవసరమైన మరియు అత్యవసర అవసరాన్ని పరిష్కరించారు” అని ప్రకటన పేర్కొంది.