యెమెన్‌లో ఓడ ప్రమాదంలో మరణించిన వలసదారులకు సంతాపాన్ని తెలిపిన పోప్

ఆగస్టు 5 న యెమెన్ తీరంలో వలసదారుల నౌక ధ్వంసం కావడం పట్ల పోప్ లియో తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పియట్రో పరోలిన్ సంతకం చేసిన ఒక టెలిగ్రామ్‌ను యెమెన్‌లోని అపోస్టోలిక్ నన్సియో మరియు అరేబియా ద్వీపకల్పానికి అపోస్టోలిక్ ప్రతినిధి ఆర్చ్ బిషప్ Zakhia El-Kassisకు పంపారు, ఆయన దానిని స్థానిక అధికారులకు అందిస్తారు.
ఈ సందేశంలో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికొరకు, ప్రాణాలతో బయటపడిన వారికి, అత్యవసర సిబ్బందికి మరియు ఈ విషాదంలో ప్రభావితమైన వారందరికీ "దైవిక బలం, ఓదార్పు కొరకు ప్రార్దిస్తుంటాము అని తెలిపారు
విపత్తు సంభవించిన ప్రాంతం "మరణ మార్గం" అని చాలా కాలంగా పిలువబడే దానిలో భాగం.
International Organization for Migration(IOM) ప్రకారం ప్రపంచంలోనే ఇది అత్యంత ప్రమాదకరమైన వలస మార్గం.
సౌదీ అరేబియా మరియు విదేశీ కార్మికులపై ఆధారపడిన ఇతర సంపన్న గల్ఫ్ దేశాలకు వెళ్లే అక్రమ రవాణాదారుల పడవలకు అడెన్ గల్ఫ్ కీలకమైన క్రాసింగ్ పాయింట్‌గా మారింది.
ఈ విషాదంలో చిక్కుకున్న వలసదారులు ఇథియోపియా నుండి యెమెన్ దక్షిణ తీరం వైపు ప్రయాణిస్తున్నారు.
IOM ప్రకారం, పడవలో 157 మంది ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు, 76 మంది మరణించినట్లు, 32 మంది ప్రాణాలతో బయటపడినట్లు మరియు మరికొందరి కొరకు గాలిస్తున్నారని తెలిపారు