మొదలైన పాప పశ్చాత్తాప పాదయాత్ర

మొదలైన పాప పశ్చాత్తాప పాదయాత్ర

మొదలైన పాప పశ్చాత్తాప పాదయాత్ర

విశాఖ అతి మేత్రాసనం, ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి గాంచిన కొత్తవలస మండలం కొండడాబా వ్యాకులమాత పండుగను  ఈ నెల 4న నిర్వహించనున్నారు. వ్యాకులమాత పండుగలో భాగంగా ఈరోజు 03.02.2024 (శనివారం) పాప పశ్చాతాప పాదయాత్ర మొదలైనది.

విశాఖ అగ్రపీఠంలోని  జ్ఞానాపురంలో గల పునీత పేతురు ప్రధాన దేవాలయం నుంచి ఈ యాత్ర ప్రారంభమైనది.  విచారణ ప్రజలు మరియు వివిధ ప్రాతాలనుండి వచ్చిన విశ్వాసులతో ఈ మహా పాప పశ్చాతాప పాదయాత్రను  పునీత పేతురు దేవాలయ  విచారణ కర్తలు గురుశ్రీ జాన్ ప్రకాష్  గారు భక్తుల కొరకు కొరకు ప్రార్ధించి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. మేరిమాత స్వరూపముతో విశ్వాసులందరు  జ్ఞానాపురం నుండి కొండడాబాకు  సుమారు 30km పాదయాత్ర చేయనున్నారు.  పాదయాత్ర చేసి దేవాలయం చేరుకొనే భక్తులకు ఈరోజు  సాయంతం4.00 గం॥లనుండి  దివ్యసత్ప్రసాద ఆరాధన, జపమాల,దివ్యబలిపూజ,  దైవ సందేశాన్ని గురువులు అందించనున్నారు.

 

Article and Design By
Mkranthi Swaroop
RVA Telugu Online Producer