మరియమాత పూజిత మాస ముగింపు ప్రార్థనలో పాల్గొన్న పోప్

మే 31వ తేదీ శనివారం మరియమాత పూజిత మాసం ముగింపును సందర్భంగా  
రోమ్ కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు, విశ్వాసులు వాటికన్‌లోని Santo Stefano degli Abissini చర్చి వెలుపల గుమిగూడారు.

అక్కడ వారు జపమాలను జెపించుకుంటూ కొవ్వొత్తులతో లూర్దుమాత గుహ వద్దకు ప్రదక్షణగా వెళ్లారు .

XIV లియో పొప్ మాట్లాడుతూ, మనమంతా ఈ సమయంలో మరియతల్లితో కలిసి నడుస్తున్నాం. 

ఆమె సంరక్షణలో మనమంతా ఆనందంగా జీవించాలని. 

ఆ దేవాది దేవున్ని కేవలం మాటల్లోనే కాక, మన జీవన విధానం ద్వారా కూడా స్తుతించాలని పోప్ కోరారు.

ప్రతి విశ్వాసి జపమాల ద్వారా క్రీస్తుతో విశ్వాస ప్రయాణం చేయాలని, ఆయన మార్గంలో నడవాలని పోప్ ముగించారు.