మదురై అగ్రపీఠానికి నూతన అపోస్టలిక పాలనాధికారి నియామకం
పరిశుద్ధ పాపు ఫ్రాన్సిస్ గారు నవంబర్ 4 ,2024 న మదురై అగ్రపీఠానికి నూతన అపోస్టలిక్ పరిపాలనాధికారిగా పాలయంకోట్టైకి చెందిన మహా పూజ్య ఆంటోనిసామి సవరిముత్తు నియమిస్తూ ప్రకటన చేశారు.
మదురై అగ్రపీఠ కాపరిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహా పూజ్య ఆంటోనీ పప్పుసామి రాజీనామాను పోప్ ఫ్రాన్సిస్ ఆమోదించారు.
డిసెంబరు 8, 1960లో జన్మించిన బిషప్ శవరిముత్తు 1987 ఏప్రిల్ 26న పాళయంకోట్టై మేత్రాసనానికి గురువుగా అభిషేకింపబడ్డారు.అనేక సంవత్సరాలుగా మేత్రాసనంలో వివిధ హోదాల్లో సేవలందించారు.
1987 నుండి 1989 వరకు పీఠాధిపతుల సెక్రటరీగాను
1989 నుండి 1992 వరకు ది మైనర్ సెమినరీలో ప్రొఫెసర్గాను
2000 నుండి 2004 వరకు కార్మత్తూర్,క్రైస్ట్ హాల్ రెక్టర్ గాను,వికార్ జనరల్ గా
నవంబర్ 20, 2019న పాలయంకోట్టై పీఠాధిపతిగా నియమితులయ్యారు
ఇన్స్టిట్యూట్ కాథొలిక్ డి పారిస్ నుండి లిసెంటియేట్, కెనాన్ లా లో డాక్టరేట్ కలిగి ఉన్నారు.
బిషప్ సవారిముత్తు గారు ఆధ్యాత్మిక మరియు విద్యా నైపుణ్యంతో మదురై అగ్రపీఠ మార్గనిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు .