భక్తియుతంగా తపస్సు కాల ప్రార్థన కూటమి

Lent Prayer meeting

భక్తియుతంగా  తపస్సు కాల ప్రార్థన కూటమి

విశాఖ అతిమేత్రాసనం వెంకోజీపాలెం విచారణ  ఆరోగ్యమాత  దేవాలయంలో ప్రత్యేక తపస్సు కాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నిన్నటి రోజున  తపస్సు కాల ప్రార్థన కూటమి భక్తియుతంగా జరిగింది.  ఈ తపస్సు కాల ప్రత్యేక ప్రార్థనలు ఆరోగ్యమాత దేవాలయ విచారణ కర్తలు  గురుశ్రీ ఎస్ పీటర్  గారి  ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.

10-03-24 (ఆదివారం) సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు జరిగిన ఈ ప్రార్థన కూటమి లో అధిక సంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు.  అరకు విచారణ కర్తలు, విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ జేసుదాస్  గారు పాల్గొని దైవ సందేశాన్ని అందించారు. విచారణ గురువులతో కలసి  దివ్య బలిపూజ, స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు.

విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. జ్ఞానాపురంకు చెందిన శ్రీ  కసిరెడ్డి చిన్నారావు మాష్టారు గారు చక్కని సంగీతంను అందించారు. మధురమైన గీతాలతో ప్రజలను, విశ్వాసులను ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్లారు.

గురుశ్రీ ఎస్ పీటర్ గారు "ఈ తపస్సు కాలంలో మారుమనస్సు పొంది ప్రభు యేసుని మార్గంలో నడవాలని, ప్రభు యేసుని ప్రేమ,కరుణ, జాలి కలిగి జీవించాలని ప్రజలను కోరారు.   

 PPC కార్యవర్గం. సొడాలిటి, లీజన్ మేరీ  సభ్యులు, యూత్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సహాయ సహకారాలను అందించారు. ప్రార్థన కూటమికి సహాయపడిన ప్రతి ఒక్కరిని విచారణ కర్తలు  గురుశ్రీ ఎస్ పీటర్ గారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer