ప్రపంచవ్యాప్తంగా ఉపవాస మరియు ప్రార్థన దినాన్ని ప్రకటించిన UISG సిస్టర్స్

ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సుపీరియర్స్ జనరల్ (UISG) ఆగస్టు 14న, ప్రపంచవ్యాప్తంగా ఉపవాసం మరియు శాంతి కోసం ప్రార్థన దినాన్ని నిర్వహించాలని అత్యవసరం విజ్ఞప్తి చేసింది.

"ప్రపంచ నలుమూలలా మానవాళి బాధల్లో పాలుపంచుకోవడానికి మన  హృదయాలను ఏకం చేసి ప్రార్థించడం మరియు చర్య తీసుకోవడం అత్యవసరమని భావిస్తున్నాము UISG సిస్టర్స్ అన్నారు 

గాజా నుండి సూడాన్ వరకు, ఉక్రెయిన్ నుండి మయన్మార్ వరకు, హైతీ నుండి DRC, సిరియా వరకు - యుద్ధం ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని బాధపెడుతుంది 

యుద్ధం, స్థానభ్రంశం మరియు అన్యాయం వల్ల కలిగే బాధలకు ప్రార్థన మరియు సంఘీభావం శక్తివంతమైన ప్రతిస్పందనలనే నమ్మకంతో పాతుకుపోయిన వివిధ మత సంస్థలు మరియు సద్భావన ఉన్న వారందరూ కలిసి ప్రార్దించాలని ఆహ్వానించారు

"మనం వేచి ఉండలేము. శాంతిని స్థాపించాలి  మరియు దానిని కలిసి నిర్మించాలి" అని విజ్ఞప్తి ధృవీకరిస్తూ హింసతో నిండిన ప్రపంచంలో, సువార్త, న్యాయం మరియు సోదరభావం యొక్క వెలుగు ఇప్పటికీ ప్రకాశిస్తుందని UISG విశ్వసిస్తూనే ఉంది అని తెలిపారు.