నూతన దేవాలయానికి శంకుస్థాపన

కంబోడియాలోని మొండుల్కిరి ప్రావిన్స్‌లోని కియో సీమా కమ్యూనిటీలో నూతన దేవాలయానికి ఫిబ్రవరి 1న కంపోంగ్ చామ్ అపోస్టోలిక్ ప్రిఫెక్ట్ మొన్సిగ్నోర్ పియర్ హాంగ్లీ సుయోన్ గారు శంకుస్థాపన చేశారు.
మొండుల్కిరి ప్రాంతంలోని గురువులు, వివిధ సభలకు చెందిన మఠకన్యలు సుమారు 150 మంది విశ్వాసులు కృతజ్ఞత దివ్యబలి పూజలో పాల్గొన్నారు.

పెరుగుతున్న కథోలికుల సంఖ్యకు ప్రతిస్పందనగా ఈ  చర్చి నిర్మిస్తున్నట్లు మొన్సిగ్నోర్ పియర్ గారు తెలియచేసారు 
నూతన దేవాలయ నిర్మాణం మరింత మంది విశ్వాసులను దేవుని యొద్దకు ఆకర్షిస్తుందని , వారు సువార్త ప్రకటించడంలో చురుకుగా పాల్గొంటారని మరియు దేవాలయ అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన ఆశించారు.

కాథలిక్ ప్నాంగ్ జాతి సమూహం కియో సీమా కమ్యూనిటీలో నివసిస్తుంది, ఇది మొండుల్కిరి ప్రావిన్స్‌లోని సేన్ మోనోరోమ్ పట్టణానికి 90 కి.మీ దూరంలో ఉంది.

ప్రస్తుతం, 70 మంది కథోలికలు మరియు 15 మంది ఉపదేశులు ఉన్నారు.