దివ్యవాణి టీవీ 8వ వార్షికోత్సవ వేడుకలు

హైదరాబాద్ అగ్రపీఠం పునీత యోహాను గురువిద్యాలయ ప్రాంగణంలో సోమవారం 2,సెప్టెంబర్ 2024 న దివ్యవాణి టీవీ తెలుగు ఛానెల్  8వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది.

హైదరాబాదు అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా ఘన పూల అంతోని గారు, ఏలూరు పీఠకాపరులు, దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహా పూజ్య పొలిమేర జయరావు గారు, నల్గొండ పీఠకాపరులు మహా పూజ్య కరణం ధమన్‌ కుమార్‌ గారు, కర్నూలు పీఠకాపరి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు మరియు విశాఖపట్నం విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు ఈ 8వ వార్షికోత్సవ వేడుకకు విచ్చేసారు. 

హైదరాబాదు అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహా ఘన పూల అంతోని గారు దివ్యపూజాబలిని సమర్పించారు. 

నల్గొండ పీఠాధిపతులు మహా పూజ్య కరణం ధమన్‌ కుమార్‌ గారు ప్రసంగిస్తూ "తెలుగు కథోలికులకు దివ్యవాణి టీవీ ఒక దీవెన అని, టీవీ ఛానెల్‌కు మద్దతు ఇస్తున్న ప్రజలకు ధన్యవాదాలు" తెలిపారు.

CRI ప్రెసిడెంట్ గురుశ్రీ ఎ స్టానిస్లాస్, SJ,  పునీత యోహాను గురువిద్యాలయ రెక్టర్ గురుశ్రీ  మర్రెడ్డి, దివ్యవాణి టీవీ CEO గురుశ్రీ లూర్దురాజు SJ మరియు గురుశ్రీ ఎ ప్రశాంత్‌ గారు పాల్గొన్నారు.

దివ్యపూజ అనంతరం దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్ సెంటర్ CEO గురుశ్రీ లూర్దురాజు SJ గారు వార్షిక నివేదికను అందించారు. 

దివ్యవాణి TV బృందం యొక్క కృషిని కార్డినల్ పూల అంతోని గారు ప్రశంసించారు.

విశాఖపట్నం విశ్రాంత పీఠాధిపతులు మల్లవరపు ప్రకాష్ గారు గతంలో దివ్యవాణి టీవీ కష్టాలను గుర్తుచేసుకుని, టీవీ ఛానెల్ ప్రారంభించిన తెలుగు పీఠాధిపతులకు ధన్యవాదాలు. మరియు ఛానెల్ సీఈఓ,సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్ సెంటర్ చైర్మన్ మహా పూజ్య  జయరావు పొలిమేర ఫీచర్ ఫిల్మ్ ఫేస్ ఆఫ్ ది ఫేస్‌లెస్ (తెలుగులో) ప్రారంబించారు.

తెలుగు ప్రజలకు తెలుగు టీవీ ఛానెల్‌ని తీసుకురావడానికి అద్భుతమైన సహకారం అందించిన టీసీబీసీ పీఠాధిపతులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

దివ్యవాణి టీవీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలను చైర్మన్ బిషప్ గారు విచ్చేసిన వారితో పంచుకున్నారు.

గురుశ్రీ ఏ ప్రశాంత్ గారు ఈ వార్షికోత్సవ వేడుకకు విచ్చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలియచేసారు.