తెలుగు ప్రాంతీయ కథోలిక న్యాయవాదుల సమావేశం

తెలుగు ప్రాంతీయ కథోలిక న్యాయవాదుల సమావేశం  

విశాఖ అతిమేత్రాసనం, మేరీమాత పుణ్యక్షేత్రం (రోజ్ హిల్స్) లో  జూన్ 16 మరియు 17వ తేదీల్లో తెలుగు ప్రాంతీయ కథోలిక న్యాయవాదుల సమావేశం జరిగింది. జూన్ 16 సాయంత్రం 4:00 గంటలకు పరిచయ సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమం అధ్యక్షులు, విశాఖ అతిమేత్రాసన అపోస్తిలిక పాలన ఆధికారి మహా పూజ్య డా|| పొలిమేర జయరావు గారి ఆధ్వర్యంలో జరిగింది.

17వ తేదీన  జ్ఞానపురం విచారణ వారి ప్రార్థన నృత్యంతో ప్రారంభమైంది. గురుశ్రీ  మనోహర్ గారు ప్రారంభ ప్రార్థన చేసారు.TCBC డిప్యూటీ సెక్రటరీ జనరల్ గురుశ్రీ  రాజు అలెక్స్ గారు అతిథులకు స్వాగతం పలుకుతూ నాయకులను వేదికకు ఆహ్వానించారు.

ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథి గా జిల్లా మరియు సెషన్స్ జడ్జి  శ్రీ దున్న రాములు గారు  పాల్గొన్నారు.
 
విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, సీనియర్ సలహాదారులు  గురుశ్రీ దుగ్గింపూడి బాలాశౌరి గారు పరిచయ పదాలతో, మహా పూజ్య డా|| పొలిమేర జయరావు గారు మరియు జడ్జి శ్రీ రాములు గారు , గురుశ్రీ  రాజు అలెక్స్, సిస్టర్  జెస్సీ కురియన్ మరియు శ్రీ ఎస్. రాజేష్ బాబు చే  దీపం వెలిగించే కార్యక్రమం(Lighting of the lamp) జరిగింది.  

శ్రీ దున్న రాములు గారు  ప్రజాస్వామ్యానికి సాధికారత అనే అంశం పై మాట్లాడారు. శ్రీ వేలూర్ రఘురాం గారు , ఇతర న్యాయవాదులు , గురువులు  ఈ సమావేశంలో మాట్లాడారు.    

మహా పూజ్య డా|| పొలిమేర జయరావు గారు మాట్లాడుతూ " న్యాయవాద వృత్తిలో చిత్తశుద్ధి, దయ, సమర్ధత, అంకితభావం, పరిపూర్ణత మరియు మన తెలుగు ప్రజల న్యాయపరమైన ప్రయోజనాల కోసం కట్టుబడి ఉండాలని" కోరారు.

ఈ కార్యక్రమంలో విశాఖ అతిమేత్రాసన ఛాన్సలర్ శ్రీ జొన్నాడ జ్ఞాన్ ప్రకాశ్ గారు, విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు గురుశ్రీ జీవన్ బాబు గారు , మేరీమాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ కొండల జోసెఫ్, గురుశ్రీ రాజేంద్ర మరియు ఇతర గురువులు , న్యాయవాదులు పాల్గొన్నారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer