తెలంగాణ మైనారిటీ విద్యార్థులకు శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు 2024-25 విద్యా సంవత్సరంలో మైనారిటీ విద్యార్థులకు పాఠశాలలు & కళాశాలల్లో ప్రవేశాల కొరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు అని మేనేజింగ్ డైరెక్టర్ TS క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు తెలియచేసారు.

18.01.24 నుండి 06.02.24 వరకు దరఖాస్తు చేసుకోగలరు.

ఎంపిక ప్రమాణాలు:

5వ తరగతి - ముందు దరఖాస్తు చేసుకున్న మైనారిటీ విద్యార్థులకు సీట్ కేటాయించబడును  & నాన్ మైనారిటీలకు లక్కీ డ్రా ద్వారా సీట్ కేటాయించబడును 

6,7,8  తరగతులలో ముందు దరఖాస్తు చేసుకున్న మైనారిటీ విద్యార్థులకు సీట్ కేటాయించబడును

ఇంటర్ మొదటి సంవత్సరం (జనరల్ & ఒకేషనల్) SSC/10వ తరగతి 2024లో GPAపై మెరిట్ ఆధారంగా సీట్ ఇవ్వబడుతుంది 

ఇంటర్మీడియట్ (COE TMRJC) స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ.

www.tmreistelangana.cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
లేదా
TMREIS మొబైల్ యాప్ ద్వారా (Google Play Store నుండి డౌన్‌లోడ్ చేసుకోండి).

మరిన్ని వివరాల కోసం www.tmreistelangana.cgg.gov.in లేదా DMWO కార్యాలయం లేదా ప్రిన్సిపల్ మైనారిటీ రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ హెల్ప్‌లైన్ 040-23437909