తిరుకుటుంబాన్ని సుమాతృకగా స్వీకరించమని పిలుపునిచ్చిన పొప్ ఫ్రాన్సిస్

29 డిసెంబర్ 2024, త్రికాల ప్రార్థన సమయంలో తిరుకుటుంబ పండుగ సందర్భంగా "
కుటుంబాలు పవిత్రతలో ఎదగాలంటే దైవాజ్ఞలు పాటించాలని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు  

ప్రతిరోజు కుటుంబ సభ్యులు ఒకరితో ఒకరు ప్రేమతో మాట్లాడుకోవాలని,సంభాషణ కుటుంబానికి అత్యంత ముఖ్యమైన అంశమని ఆయన అన్నారు.

తిరుకుటుంబం ప్రతి కుటుంబానికి ఎందుకు ఆదర్శంగా ఉందంటే ఆ కుటుంబం ప్రతిరోజు కలిసి మాట్లాడుకునే వాళ్లని ,ఒకరిని ఒకరు ఆలకించేవారని ఆయన అన్నారు.

ప్రతిరోజు మాట్లాడుకొని కుటుంబం సంతోషకరమైన కుటుంబం కాదని, ప్రతి కుటుంబం దేవుని ప్రేమలో వర్ధిల్లుతూ, తిరు కుటుంబాన్ని పోలి జీవించాలని, కష్టనష్టాలను ఓర్పుతో సహిస్తూ, పవిత్రాత్మ బాటలో అడుగులు వేయాలని పొప్ ఫ్రాన్సిస్ కోరారు