డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ సావో టోమ్ మరియు ప్రిన్సిపీ అధ్యక్షుడిని కలిసిన పోప్

జూన్ 30 సోమవారం ఉదయం వాటికన్‌లో పోప్ లియో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ సావో టోమ్ మరియు ప్రిన్సిపే అధ్యక్షుడు Carlos Manuel Vila Nova తో సమావేశమైయ్యారు.   

పొప్ ను కలిసిన తరువాత అంతర్జాతీయ సంస్థలతో హోలీ సీ సంబంధాల కార్యదర్శి మహా  పూజ్య పాల్ రిచర్డ్ తో సమావేశమైనట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో  పేర్కొంది 

సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన స్నేహపూర్వక చర్చలలో భాగంగా ఇరు దేశాల మధ్య  ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రస్తావించబడింది 

"దేశ రాజకీయ,సామాజిక-ఆర్థిక పరిస్థితిని, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ మరియు విద్యా  రంగాలలో స్థానిక శ్రీసభ సహకారం, ద్వీపసమూహంలోని యువత ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు.  

"దేశాల మధ్య సంభాషణ మరియు సహకారాన్ని పెంపొందించడం అవసరమని, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాల వ్యక్తపరిచారు అని ప్రకటన పేర్కొంది