చైతన్య కథలు -2 పుస్తక ఆవిష్కరణ

ఆగస్టు 14,2024 న హైదరాబాద్ అగ్రపీఠం, దివ్యవాణి టీవీ ప్రాంగణంలో ఎమ్.డి విన్సెంట్ గారు రచించినటువంటి చైతన్య కథలు -2  పుస్తకాన్ని ఖమ్మం మేత్రానులు మహా పూజ్య సగిలి ప్రకాష్ ఆవిష్కరించారు.

ఈ పుస్తక ఆవిష్కరణ సందర్బంగా ఎమ్.డి విన్సెంట్ గారిలోని తపన, తాను శ్రీసభకు, దైవ రాజ్య నిర్మాణానికి తన వంతు కృషి చేయాలని ఎప్పుడు తాపత్రయ పడతారని అందుకు నిదర్శనమే చైతన్య కథలు 1 మరియు 2 పుస్తకాలను ప్రచురించి తెలుగు విశ్వాసులకు అందించినందుకు ఖమ్మం మేత్రానులు అభినందించారు.

ఈ సందర్బంగా గురుశ్రీ దూసి రవిశేఖర్ SJగారు తన 25 వసంతాల గురుత్వ వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న సందర్భమున చైతన్య కథలు 2 పుస్తకానికి  ఎమ్.డి విన్సెంట్ గారికి సహకారాన్ని అందించి, ప్రచురించడానికి తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చిన సందర్బంగా మేత్రానుల వారు గురుశ్రీ దూసి రవిశేఖర్ గారిని షాలువాతో సత్కరించారు.

ఈ ప్రచురణను ప్రోత్సహించిన  దివ్యవాణి CEO గురుశ్రీ లూర్దురాజు గారికి, గురుశ్రీ అనకర్ల ప్రశాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.

పుస్తకాన్ని ఆవిష్కరించిన ఖమ్మం  మేత్రానులను ఎమ్ డి విన్సన్ట్ గారి కుటుంబ సభ్యులు పూలమాలతో, షాలువాతో సత్కరించారు.

ఈ పుస్తంలో ఉన్నటువంటి కథలు అన్నీ కూడా భారతమిత్రం పత్రికలో ప్రచురించబడినవి, అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తనను ఎంతగానో ప్రోత్సహించిన హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారికి కూడా కృతజ్ఞతలు తెలియచేసారు 

ఎమ్ డి విన్సన్ట్ గారు అమృతవాణి, భారతమిత్రం విభాగాలలో విస్తృతమైన సేవను అందించినందుకు అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు అభినందించారు

చైతన్య కథలు క్రైస్తవ విశ్వాసానికి ఎంతో సహకరిస్తాయని విన్సెంట్ గారు తెలియచేసారు.

వీరికి అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా వారి తరపున హార్దిక శుభాకాంక్షలు.