ఘనంగా జరిగిన గురుశ్రీ అల్లం ఆరోగ్య రెడ్డి గారి గురుత్వ రజత జూబిలీ వేడుకలు

గురుశ్రీ అల్లం ఆరోగ్య రెడ్డి గారి గురుత్వ రజత జూబిలీ వేడుకలు

ఘనంగా జరిగిన గురుశ్రీ అల్లం ఆరోగ్య రెడ్డి గారి గురుత్వ రజత జూబిలీ వేడుకలు 

ఫిబ్రవరి 19 2025 న గురుశ్రీ అల్లం ఆరోగ్య రెడ్డి గారి గురుత్వ రజత జూబిలీ వేడుక నల్గొండ మేత్రాసనంలోని లూర్దుమాత దేవాలయం నందు ఘనంగా జరిగింది.

ఈ జూబిలీ మహోత్సవానికి హైదరాబాద్ అగ్రపీఠాధిపతి మహా పూజ్య కార్డినల్ పూల అంతోని గారు, ఖమ్మం మేత్రాసన పీఠకాపరి మహా పూజ్య సగిలి ప్రకాష్ గారు, నెల్లూరు మేత్రాసన పీఠకాపరి మహా పూజ్య ప్రకాశం గారు, కర్నూల్ పీఠకాపరి మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు, నెల్లూరు పీఠ సహకాపరి మహా పూజ్య పిల్లి అంతోని దాస్ గారు, విజయవాడ పీఠకాపరి మహా పూజ్య తెలగతోటి రాజారావు గారు, నల్గొండ విశ్రాంత పీఠకాపరి మహా పూజ్య గోవిందు జోజి గారు విచ్చేసి కృతజ్ఞతా దివ్యబలిపూజను సమర్పించారు.

మహా పూజ్య గోరంట్ల జ్వాన్నెస్ గారు అమూల్యమైన దైవ సందేశాన్ని అందించారు. పూజానంతరం గురుశ్రీ ఆరోగ్య రెడ్డి గారు పీఠాధిపతులు మరియు రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలిపారు.