కళాత్మకంగా జరిగిన జూబిలీ 2025 నృత్య రూపకం
కళాత్మకంగా జరిగిన జూబిలీ 2025 నృత్య రూపకం
నవంబర్ 23 , 2024 న సికింద్రాబాద్ లోని సెయింట్ మేరీస్ బసిలికా లో జూబిలీ 2025 నృత్య రూపక ప్రదర్శన జరిగింది . ఈ కార్యక్రమానికి హైదరాబాద్ అగ్రపీఠాధిపతి మహా పూజ్య కార్డినల్ పూల అంతోని గారు ముఖ్య అతిధి గా విచ్చేసారు.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆదేశాలనుసారం జూబిలీ 2025 కు సన్నాహకంగా హైదరాబాద్ అగ్రపీఠం వారు తలపెట్టిన ప్రత్యేక సువార్తాప్రచార కార్యక్రమంలో భాగంగా డాటర్స్ అఫ్ సెయింట్ పౌల్స్ వారి సౌజన్యంతో, సెయింట్ పాట్రిక్స్ స్కూల్ కరస్పాండెంట్ గురుశ్రీ దూసి రవి శేఖర్ గారి ఆధ్వర్యంలో కళాదర్శిని పూర్వ విద్యార్థులు ఈ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి జూబిలీ 2025 సందేశం ఇతివృత్తంగా ఈ రూపకం నిర్మించబడింది, నిరీక్షణ సందేశాన్ని విశ్వాసులకు మరింత విరివిగా ప్రచారం చెయ్యడంలో భాగమే ఈ కార్యక్రమం అని గురుశ్రీ రవిశేఖర్ అన్నారు.
నిరీక్షణ యాత్రికులు అనే జూబిలీ సందేశాన్ని నృత్యరూపకంలో చాల అద్భుతంగా ప్రదర్శించిన నృత్యకారులు, నటులకు మరియు దీనిని రూపొందించిన గురుశ్రీ దూసి రవి శేఖర్ గారికి, ఈ కార్యక్రామానికి అన్ని విధాలుగా సహకరించి వెన్నెముకగా నిలిచిన పాస్ట్రల్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ ఆరోగ్యస్వామి గారికి మహా పూజ్య కార్డినల్ పూల అంతోని తన అభినందనలు తెలిపారు.
ఈ నృత్యరూపకం ఆధ్యంతం సంగీత, నృత్య, నాటకాలతో ఆహ్లాదకరంగా జరిగింది.
Article and Design by: Bandi Arvind.