ఎక్యుమెనిజం కమిషన్ కార్యదర్శిగా ఫాదర్ అంతయ్య గారు నియమితులయ్యారు

ఎక్యుమెనిజం కమిషన్ కార్యదర్శిగా ఫాదర్ అంతయ్య గారు నియమితులయ్యారు
బెంగళూరు, 10 మే 2025 కాథలిక్ బిషప్‌ల (CCBI)సమావేశంలో కమిషన్ ఫర్ ఎక్యుమెనిజం (Ecumenism) కొత్త కార్యదర్శిగా ఫాదర్ డాక్టర్ అంతయ్య కొండవీటి గారు నియమితులయ్యారు.మే 6,7 తేదీలలో బెంగళూరులో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫాదర్ అంతయ్య గారు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు మేత్రాసనానికి చెందిన వారు. 1969 మే 5న కాట్రపాడులో జన్మించిన ఆయన 1995 ఏప్రిల్ 27న గురువుగా నియమితులయ్యారు. ఫాదర్ అంతయ్య గారు రోమ్‌లోని పోంటిఫికల్ అర్బన్ విశ్వవిద్యాలయం నుండి డాగ్మాటిక్ థియాలజీ(Dogmatic Theology)లో డాక్టరేట్ పొందారు మరియు సిస్టమాటిక్ థియాలజీ(Systematic Theology)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అధ్యయనాలతో పాటు సెమినరీ ఫార్మేటర్లకు రిఫ్రెషర్ కోర్సును కూడా ఫాదర్ అంతయ్య గారు అభ్యసించారు.
ఫాదర్ అంతయ్య గారు గతంలో CCBI అసిస్టెంట్ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని సెయింట్ జాన్స్ రీజినల్ సెమినరీలో సిస్టమాటిక్ థియాలజీ అధ్యాపకులుగా మరియు స్పిరిచువల్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.
ప్రస్తుతం, ఫాదర్ అంతయ్య గారు తెలుగు కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ (TCBC)లోని "కమిషన్స్ ఆఫ్ ఎక్యుమెనిజం అండ్ డైలాగ్"కు రీజినల్ సెక్రటరీగా మరియు తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (Federation of Telugu Churches) ప్రాంతీయ కార్యదర్శిగా ఉన్నారు.
టిసిబిసి - క్రైస్తవ సమైక్య విభాగ ప్రాంతీయ కార్యదర్శి గా ఫాదర్ అంతయ్య గారు హిందూ మతం,ఇస్లాం, జైన్ మతం, బౌద్ధమతం, సిక్కు మతం మరియు క్రైస్తవ మతాల ప్రతినిధులు తో కలసి మత సామరస్యాన్ని, సమాజంలో అన్ని మతాల మధ్య శాంతిని పెంపొందించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer