ఉత్తర ఐరోపా యాత్రికులను కలిసిన పోప్

శనివారం జులై 5, జూబ్లీ సంవత్సరం రోమ్ పర్యటనలో భాగంగా డెన్మార్క్, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్ మరియు స్కాట్లాండ్ నుండి వాటికన్‌కు వచ్చిన యాత్రికులను పోప్ లియో XIV కలిశారు .
డెన్మార్క్‌లోని Copenhagen మేత్రాసనం నుండి యువకులు, బ్రిటిష్ దీవుల నుండి అనేక మంది ఉపాధ్యాయులతో కూడిన బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ,
హాజరైన యువకులను ఉద్దేశించి పోప్ మాట్లాడుతూ, దేవుడు ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడని వారికి గుర్తు చేశారు.
"దేవుడు మీలో ప్రతి ఒక్కరినీ ఒక ఉద్దేశ్యం మరియు లక్ష్యంతో సృష్టించాడు" అని ఆయన అన్నారు.
తీర్థయాత్రను ప్రార్థన మరియు వివేచన కోసం ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని వారిని కోరారు.