ఈజిప్షియన్ యువకుల బృందాన్ని కలిసిన పోప్

ఆగస్టు 2, శనివారం ఉదయం, యూత్ జూబ్లీలో పాల్గొనడానికి రోమ్‌కు చేరుకున్న ఈజిప్షియన్ యువకుల బృందాన్ని పోప్ లియోని కలిశారు
Greek Melkites సహాయక పీఠాధిపతి మరియు టార్సస్ పీఠాధిపతి Jean-Marie Chami ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు.
విషాదకరంగా, తీర్థయాత్ర బృందం సభ్యులలో ఒకరైన 18 ఏళ్ల Pascale Rafic, వారితో కలిసి జూబ్లీలో పాల్గొనడానికి రోమ్‌కు చేరుకున్న రోజున మరణించారు.
Pascale కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు నష్టానికి దుఃఖిస్తున్న వారందరికీ ప్రభుని ఓదార్పు కలగాలని ప్రార్థిస్తున్నాను
ఈ సమయంలో మీరందరూ మీ స్నేహితుని కోల్పోయినందుకు ఎంతో భాదను అనుభవిస్తున్నారు,మీ విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి మరియు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థన చేసే అవకాశం కలిగింది అని పోప్ అన్నారు
కాబట్టి జూబ్లీ నిరీక్షణా సంవత్సరం తీర్థయాత్ర రోజులలో ఆ దేవుడు మీ అందరితో ఉండాలని మరియు మీరందరూ దేవుని ప్రేమ, కృపతో రక్షించబడతారని పోప్ అన్నారు