ఆఫ్ఘనిస్తాన్ భూకంప బాధితుల కొరకు ప్రార్థించిన పోప్

ఆగస్టు 31న సాయంత్రం తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌ను 6.0 తీవ్రతతో భూకంపం తాకింది. కనీసం 800 మంది మరణించగా, వేలాది మంది గాయపడ్డారు.
ఈ వార్త తెలిసిన వెంటనే ఈ ప్రకృతి వైపరీత్యం బారిన పడిన ప్రతి ఒక్కరికీ తన విచారం వ్యక్తం చేస్తూ టెలిగ్రామ్ పంపారు.
విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్ సంతకం చేసిన టెలిగ్రామ్ సందేశంలో
మరణించిన వారికీ, గాయపడిన వారికి మరియు తప్పిపోయిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తునాం అని పోప్ అన్నారు.
పునరుద్ధరణ ప్రయత్నాలలో సహాయపడుతున్న అత్యవసర సిబ్బంది మరియు పౌర అధికారులకు పోప్ తన హృదయపూర్వక సంఘీభావాన్ని వ్యక్తం చేశారు".
ఈ క్లిష్ట సమయంలో ఆఫ్ఘన్ దేశ ప్రజలకు "ఓదార్పు మరియు దైవిక ఆశీర్వాదాలు అందిస్తూ ప్రార్థించారు.