అమృతవాణి ని పర్యవేక్షించిన అధ్యక్షులు మహా పూజ్య పొలిమెర జయరావు

అమృతవాణి ని పర్యవేక్షించిన అధ్యక్షులు మహా పూజ్య పొలిమెర జయరావు
తెలుగు రాష్ట్రాలకు ప్రాంతీయ సమాచార కేంద్రమైన అమృతవాణి యొక్క పనితీరు మరియు కార్యకలాపాలను అధ్యక్షులు మహా పూజ్య పొలిమెర జయరావు గారు
పరియవేక్షించారు. 05 సెప్టెంబర్ 2024 ఉదయం 11 : 00 గంటలకు ఆయన అమృతవాణి సమాచార కేంద్రాన్ని సందర్శించారు.
అమృతవాణి భవనాన్ని పూర్తిగా పరిశీలించి మెరుగు పరచవలసిన అంశాలను గూర్చి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారికి మరియు అమృతవాణి సిబ్బందికి కూడా సూచనలను ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన కాథలిక్ బ్యాంక్ సిబ్బందిని కూడా కలిశారు. అమృతవాణి యొక్క లావాదేవీల గురించి ఆయన కాథలిక్ బ్యాంక్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రేడియో వెరితాస్ ఆసియ తెలుగు సిబ్బందిని కూడా ఆయన కలిసి వారికి దిశా నిర్దేశం చేసారు.
రానున్న సంవత్సరాలలో అమృతవాణి ఏ దిశగా పయనించాలి, దైవ సందేశం సమాచార మాధ్యమాల ద్వారా ఏ విధంగా ముందుకు నడిచి ఖండాంతరాలకు ఎలా చేరాలి , అనే విషయాలను గూర్చిన కొన్ని కీలక అంశాలను వివరించారు.
అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు, అమృతవాణి సిబ్బంది మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు సిబ్బంది, అధ్యక్షులు మహా పూజ్య పొలిమెర జయరావు తండ్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
Article by: Arvind Bandi
Online Content Producer