తిరుకుటుంబ మహోత్సవం | డిసెంబర్ 31

ఈ పుడమిపై దేవుని ఉధారమైన ఓ కానుక: పవిత్ర తిరుకుటుంబం, ప్రియ కుమారుని అత్యంత ప్రియమైన మొట్టమొదటి బహుమానం, ముచ్చటైన బహుమానం, మహిమగల బహుమానం: యేసు, మరియ యోసేపుల నజరేతు కటుంబం. పశువుల కొట్టయే ఈ పవిత్ర కుటుంబానికీ పునాది.

తిరుకుటుంబం ఓ పవిత్ర కుటుంబంగా దీవించబడటానికీ కారణం : వారు ఇహలోక నివాసంపై ఆధారపడలేదు. కాని, పరలోక విశ్వాసంపై తమ జీవితాన్ని నిర్మించుకున్నారు. మరియ యోసేపులు నేటి “తల్లిదండ్రులకు” ఆదర్శం. మరియ యోసేపులు బాలయేసును విశ్వాసంతో పెంచారు, తమ బిడ్డను దైవ గృహానికి నడిపించారు. క్రైస్తవ తల్లిదండ్రులకును ఇవ్వబడిన అత్యంత ప్రధానమైన భాద్యత ఇది.

బిడ్డలందరికీ  ఆదర్శం బాలయేసు: బాలయేసు పసిప్రాయం నుండే తన తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటంలో దాని పరిపూర్ణంగా పాటించటంలో ఎప్పుడు ముందంజలో ఉన్నారు. ఆయన తన కుటుంబానికి, ముఖ్యముగా అమ్మకు నాన్నకు విధేయించి జీవించారు.

ప్రతి యువతీ యువకుడు ఆ "పవిత్ర బాలుని” ఆదర్శంగా తీసుకోవాలి. ఆ “బాలుని”గా ఎదగాలి. అందరికీ తిరుకుటుంబ పండుగ శుభాకాంక్షలు.