ఇండోనేషియాలోని యువతకు మరియు కుటుంబాలకు చేయూత అందిస్తున్న హోలీ స్పిరిట్ సిస్టర్

హోలీ స్పిరిట్ సిస్టర్స్‌గా ప్రసిద్ధి చెందిన మిషనరీ కాంగ్రెగేషన్ ఆఫ్ సిస్టర్స్, సర్వెంట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ (SSpS) సభకు చెందిన సిస్టర్ మార్గరెత అడా గారు, లెంబటా సిస్టర్స్ వృత్తి శిక్షణా కేంద్రం (BLK) వ్యవస్థాపకురాలు.

తను ఈస్ట్ ఫ్లోర్స్‌లోని, గుంథిల్డ్ కరితాస్ పెదులి ఫౌండేషన్‌కు అధిపతి కూడా.

డిసెంబర్ 13న, సిస్టర్ గారు తన బృందంతో బుకిట్ పడా, లెంబాటా, తూర్పు నుసా టెంగ్‌గారా రాతి కొండలపై యువత కోసం భవన నిర్మాణానికి మొదటి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

రెండు నెలల క్రితం చర్చి నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా, కిందపడి గాయపడ్డారు. మూడు ప్లాటినమ్ ప్లేట్లు ఆమె కుడి కాలులో పెట్టబడ్డాయి. అయినా కొంపస్ హ్యుమానిటేరియన్ ఫండ్ ఫౌండేషన్ (డికెకె)కి చెందిన బృందంతో కలిసి సిస్టర్ గారు తన చేతి కర్రతో 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కమ్యూనిటీ సెంటర్‌ను నిర్మించడంలో సహాయపడ్డారు.

"నేను గాయం నుండి కోలుకుంటున్నప్పటికీ, నేను ఉదయం నుండి రాత్రి వరకు నా రోజువారీ పనులు అనగా వంట చేయడం, బోధించడం, అతిథులను స్వీకరించడం, సమావేశాలు మరియు కళాకారులను పర్యవేక్షించడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తూనే ఉన్నాను" అని సిస్టర్ మార్గరెత తెలిపారు.

2019 లో, తను USA-చికాగోలోని డిపాల్ విశ్వవిద్యాలయం నుండి హెచ్. ఆర్ మాస్టర్ ఆఫ్ సైన్స్ పొందిన తర్వాత లెంబాటాలోని కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ కోసం పని చేయడం ప్రారంభించారు.

గ్రాడ్యుయేషన్ తర్వాత, తను లెంబటాలోని కొత్త మిషన్‌లో, మరో ఇద్దరు మఠకన్యలతో కలిసి సేవ చేయడం సంతోషంగా ఉంది అని తెలిపారు.

ప్రారంభంలో, ఈ ముగ్గురు మఠకన్యలు ఒక ఇంటిని అద్దెకు తీసుకొని నివసించారు. వారు ఇప్పటికీ ఈ ఇంటిని తమ ఆంగ్ల తరగతులు, ఫ్యాషన్ షోలు మరియు క్యాటరింగ్ కోసం ఉపయోగిస్తున్నారు.

మానవ అక్రమ రవాణా కేసులు ఎక్కువగా ఉన్న లెంబాటా ద్వీపంలో యువతీయువకుల  కుటుంబాలు మరియు పిల్లల పట్ల తమ ఆందోళన వ్యక్తపరిచారు.

ఇక్కడ ఉన్న చాలా మంది యువకులు అనుమతి లేకుండా మలేషియా వెళ్లి ఆందోళనకు గురవుతున్నారు. ప్రజలకు ఈ నైపుణ్యాలను అందించడం ద్వారా ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఓ ప్రయత్నం అని సిస్టర్ గారు అన్నారు.

ఇప్పటివరకు 276 మంది BLK గ్రాడ్యుయేట్లు ఉండగా, వీరిలో 12 గ్రూపులు ఇన్ఫర్మేటిక్స్ ఇంజనీరింగ్‌లో ప్రధానమైనవి