జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం

జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం

ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం (National Energy Conservation Day) ను జరుపుకుంటారు.1991 నుంచి ప్రతీ సంవత్సరం డిసెంబరు 14 న భారత ప్రభుత్వ Bureau of Energy Efficiency  (BEE) విభాగం భారతదేశంలో జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.

ఏ వస్తువు పనిచేయాలన్నా దానికి తగిన ఇంధనం కావాలి. పెట్రోల్లేక పోతే బండి, బస్సూ,కారు  ఏదీ కదలదు. విద్యుత్తు లేకపోతే లైట్స్ ,ఫ్యాన్, టీవీ, మిక్సీ, రిఫ్రిజిరేటరు,  - ఏవీ పనిచేయవు.  కనుక ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతను తెలుసుకుందాం.ఇంధనాలను అవసరానికి మించి  వినియోగిస్తే  డబ్బు వృధా చేయడమే కాకుండా   అవి ఇంకెందరికో దొరక్కుండాపోయే అవకాశం వుంది.  ఇంధన వనరులు తక్కువ కనుక ఆచితూచి, ఆలోచించి ఉపయోగించడం విజ్ఞత అనిపించు కుంటుంది.ఇంతకీ ఇంధన పొదుపు అంటే వీలైనంత తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తూ యథావిధిగా పని కొనసాగేలా చూడటమే! ఎక్కడా ఇంధనం వృథా కాకుండా జాగ్రత్తపడాలి. సమర్థతను బట్టి తక్కువ ఇంధనంతో పని పూర్తి చేయొచ్చని ఎందరో రుజువు చేసి చూపుతున్నారు. పెద్ద పెద్ద ఫాక్టరీల్లో వీలైనంతగా ఇంధనాన్ని పొదుపుచేస్తూ, ఉత్పాదన పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అనేక సంస్థలు నష్టాల్లో ఉన్నాయంటే, ఏకంగా మూత పడ్తున్నాయంటే ఇంధన దుర్వినియోగం, ఎక్కువైన సిబ్బం దే ప్రధాన కారణం.

ఈ రోజు జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్బంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తారు.
ఇంధన పరిరక్షణ అంశంపై వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు.కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం రోజున ఇంధన పరిరక్షణకు కృషి చేసిన వివిధ పరిశ్రమలు కంపెనీలకు,  హోటళ్ళకు, ఆసుపత్రి భవనాలకు, కార్యాలయాలకు, షాపింగ్‌ మాల్‌ బిల్డింగులకు, జోనల్‌ రైల్వే, రాష్ట్ర సంబంధ ఏజెన్సీలు, మున్సిపాలిటీలు, థర్మల్‌ పవర్‌ స్టేషన్లుకు జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు అందజేస్తున్నారు.