వరద బాధితుల కోసం ప్రార్ధించిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు
పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు DRCలో వరద బాధితుల కోసం ప్రార్థించారు మరియు కొలంబియా బందీలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు
కొలంబియాలో కిడ్నాప్‌కు గురైన వ్యక్తులను విడుదల చేయాలని ఫ్రాన్సిస్ పాపు గారు విజ్ఞప్తి చేశారు. విపరీతమైన వరదల వల్ల ప్రభావితమైన కాంగో రిపబ్లిక్ ప్రజలకు కూడా ఆయన తన సాన్నిహిత్యాన్ని వ్యక్తం పరిచారు .
ఆదివారం ప్రార్థన ముగింపులో సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో ప్రజలను ఉద్దేశించి ఆయన "ప్రస్తుతం కొలంబియాలో కిడ్నాప్ చేయబడిన ప్రజలందరినీ బేషరతుగా విడుదల చేయాలని" అభ్యర్ధించారు.
ఈ చర్య, దేవుని ముందు మన కర్తవ్యమని పాపు గారు జోడించారు, ఇది దేశంలో సయోధ్య మరియు శాంతి వాతావరణాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడుతుంది అని అన్నారు .
మరోసారి, పాపు గారు శాంతి కోసం కోరుతూ, ముఖ్యంగా హింస రగులుతున్న "ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనా" మరియు మన ప్రపంచంలోని ఇతర దేశాలలో శాంతి, సంఘర్షణలను నిలిపివేస్తుంది అని తెలిపారు