డొమినికా కామన్వెల్త్ ప్రధాన మంత్రితో సమావేశమైన పోప్

సెప్టెంబర్ 12 వాటికన్ అపోస్టోలిక్ ప్యాలెస్‌లో Dominica కామన్వెల్త్ ప్రధాన మంత్రి Roosevelt Skerritను పొప్ లియో తన ప్రేక్షకుల సమావేశం ముందు కలిసారు

పోప్‌తో సమావేశమైన తర్వాత వీరు హోలీ సీ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌ మరియు రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి ఆర్చిబిషప్ పౌల్ ను కలిసినట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది

సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన స్నేహపూర్వక చర్చల సందర్భంగా, హోలీ సీ మరియు డొమినికా మధ్య మంచి సంబంధాలను గుర్తించారు.

అనంతరం సామాజిక సహాయం మరియు విద్యా రంగంలో స్థానిక శ్రీసభ అందించే విలువైన సహకారంపై దృష్టి సారించారు.

డొమినికన్ ప్రజల మంచి కోసం సహకారాన్ని ప్రోత్సహించడానికి పరస్పర నిబద్ధతను పునరుద్ధరించడం వంటి కొన్ని ప్రస్తుత ప్రాంతీయ మరియు జాతీయ సామాజిక-రాజకీయ అంశాలపై కూడా చర్చలు జరిగాయి అని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది