క్రైస్తవ ఐక్యతే లక్ష్యంగా పోప్ లియో - బర్తొలోమ్యూ భేటీ

కతోలిక శ్రీసభ అధిపతి పోప్ లియో, తూర్పు ఆర్థడాక్స్ శ్రీసభకు చెందిన కాన్స్టాంటినోపుల్ ఎక్యుమెనికల్ అధిపతి ఒకటవ బర్తొలోమ్యూ శనివారం, అక్టోబర్ 24న వాటికన్‌లోని అపోస్టోలిక్ ప్యాలెస్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ భేటీ సందర్భంగా ఇటీవల అక్టోబర్ 13న పోప్ లియోకు జరిగిన ఊపిరితిత్తుల శస్త్రచికిత్స అనంతరం ఆయన త్వరగా కోలుకోవాలని ఒకటవ బర్తొలోమ్యూ  ఆకాంక్షించారు. తన ఆరోగ్యం పట్ల చూపిన శ్రద్ధకు పోప్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో ఇరువురు వివిధ అంశాలతో పాటు, అంతర్జాతీయ పరిస్థితులపై కూడా చర్చించారు.

క్రైస్తవ ఐక్యత కోసం ఇరువురు నాయకులు కొనసాగిస్తున్న ప్రయాణంలో ఈ సమావేశం మరో ముఖ్యమైన ముందడుగుగా నిలిచింది.

2025 నవంబర్‌లో టర్కీలోని నైసియా నగరంలో జరిగిన మొదటి నైసియా మహాసభ 1,700వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ సందర్భంగా క్రైస్తవ ఐక్యతకు మద్దతుగా సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారు.

Telugu Survey Popup Image