టిసిబిసి - అంతర్మత సమాలోచన సేవ విభాగం వారి క్రిస్మస్ వేడుకలు
టిసిబిసి - అంతర్మత సమాలోచన సేవ విభాగం వారు సికింద్రాబాద్, అమృతవాణి హాల్ నందు డిసెంబర్ 19 , 2024 న క్రీస్తు జనన మహోత్సవాన్ని కొనియాడడానికి సమావేశమయ్యారు.
మత సామరస్యాన్ని, సమాజంలో అన్ని మతాల మధ్య శాంతిని మరియు మానవాళికి ఆశాజనకంగా ఉండేలా చూడాలనే లక్ష్యంతో ఈ మతాంతర క్రిస్మస్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూలా అంతోని గారి అధ్యక్షతన ఘనంగా జరిగింది.
తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దీపక్ జాన్ గౌరవ అతిథిగా విచ్చేసి, అన్ని మతాల వారికి తన వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు.
రామకృష్ణ మట్ ప్రతినిధి శ్రీమతి నిధి ఆనంద్, జమాత్ ఈ ఇస్లామీ హింద్ డైరెక్టర్ హమీద్ మొహమ్మద్ ఖాన్ , బుద్దిస్ట్ మోనాస్టిక్ ఖ్వీర్ రైట్స్ కార్యకర్త తాషి చౌడ్ప్, జైన్ సంఘ పెద్ద సుశీల్ చనోదియా, గురుద్వారా హెడ్ గ్రాంతి గ్యాని జగదేవ్ సింగ్, కన్హా శాంతి వనం మానేజర్ వినీత్ సింగ్ రణావత్ గార్లు గెస్ట్ స్పీకర్లుగా ఈ కార్యక్రమానికి విచ్చేసారు.
సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజీ వారు స్వాగత ప్రార్ధన గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం విచ్చేసిన వివిధ మతాల ముఖ్య అతిథులతో జ్యోతి ప్రజ్వలన చేశారు.
టిసిబిసి - క్రైస్తవ సమైక్య విభాగ ప్రాంతీయ కార్యదర్శి గురుశ్రీ కే అంతయ్య గారు స్వాగత పలుకులతో ఆహ్వానించారు.
ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సంఘాల సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ సంఘాల సమాఖ్య వారి నేతృత్వంలో ఏర్పాటు చేయబడింది అని గురుశ్రీ అంతయ్య గారు అన్నారు
తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య డిప్యూటీ సెక్రటరీ గురుశ్రీ రాజు అలెక్స్ , వివిధ విభాగాల డైరెక్టర్లు, మఠకన్యలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో హిందూ మతం, జైన్ మతం, బౌద్ధమతం, సిక్కు మతం, ఇస్లాం, మరియు క్రైస్తవ మతాల ప్రతినిధులు తమ తమ మతాలలో ప్రేమ, సేవ, త్యాగం, స్వీయ నియంత్రణ, కలుపుగోలుతనం, ఆతిథ్యం, ప్రతిఒక్కరి పట్ల గౌరవం, సమానత్వం మొదలైన ప్రధాన విలువలను తెలియజేసారు.
"క్రిస్మస్ - నిరీక్షణతో మానవ సమాజాన్ని మెరుగుపరచడం" అనే శీర్షికతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
టీసీబీసీ డిప్యూటీ సెక్రటరీ గురుశ్రీ అలెక్స్ గారు విచ్చేసిన హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూలా అంతోని గారికి ,ఇతర మతపెద్దలకు, గురువులకు, మఠకన్యలకు, సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల విద్యార్థులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.