మండపేట,ఏడిద లలో కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం (APSSS)

మహిళా సాధికారతే  లక్ష్యంగా ముందుకు సాగుతున్నా మన APSSS

మండపేట,ఏడిద లలో కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

ఆంద్రప్రదేశ్ సాంఘిక సేవా సంస్థ(APSSS) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవ కార్యక్రమాలు ప్రశంసనీయమని 2 వ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్ పేర్కొన్నారు.

ఆంద్రప్రదేశ్ సాంఘిక సేవా సంస్థ(APSSS) 47 ఏళ్ళు గా తెలంగాణ, ఏపీ రాష్ట్ర ల్లో మహిళా సాధికారత కోసం విశేష కృషి చేస్తోంది.ఈ నేపథ్యంలో సంస్థ చైర్మన్ ఏలూరు పీఠాధిపతి మహా పూజ్య  జయరావ్ పొలిమేర మరియు విశాఖ అగ్రపీఠాధిపతి మహా పూజ్య  మల్లవరపు ప్రకాష్ గార్ల ఆశీస్సులతో మండపేట, ఏడిద ల్లో రెండు కుట్టు శిక్షణ కేంద్రాలు గురువారం ఆరంభించారు.

మండపేట ఆర్ సి ఎం దేవాలయ ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ  రత్నాకర్ గారు  శిక్షణ లో పాలొన్నవారికొరకు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం శిక్షణ నిపుణులతో, మహిళలతో మాట్లాడి పలు వివరాలను అడిగి తెలుసుకొన్నారు.

ఒక్కో కేంద్రంలో 30 మంది చొప్పున మొత్తం 60 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇస్తున్నట్లు  కార్యక్రమం నిర్వాహకులు ఏపీ ఎస్ ఎస్ ఎస్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (సికింద్రాబాద్) ఫాదర్ టిపి ప్రసాద్ గారు తెలిపారు.
ఈ సందర్భముగా గురుశ్రీ  టి. పి. ప్రసాద్ గారు మాట్లాడుతూ   "పేద మహిళలు, మధ్య తరగతి మహిళలకు స్వయం ఉపాధి కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవడమే APSSS లక్ష్యం అని అన్నారు.  ప్రతి ఒక్క మహిళా ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండి స్వతహాగా ఎదగడం అనేది చాలా ముఖ్యమని అందుకు ప్రతి ఒక్క మహిళా కుట్టు మిషన్‌ శిక్షణను పూర్తి స్థాయిలో నేర్చుకొని స్వంతంగా ఉపాధి పొందుతూ కుటుంబంలో సమాజంలో నిలబడాలని  ఆకాంక్షించారు.

విశాఖపట్నం సోషల్ సర్విస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ శివం సుధాకర్ గారు మాట్లాడుతూ ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణ అనేది ప్రతి రోజు ఉంటుందని,  శిక్షణ నిపుణులచే శిక్షణను ఇప్పించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ కుట్టూ మిషన్‌ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సోషల్ సర్విస్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ శివం సుధాకర్, ఆర్ సి ఎమ్ చర్చి ఫాదర్ రత్నాకర్ ల తో పాటూ మాజీ కౌన్సిలర్ జంపా రాంబాబు, మట్టా ఆదినారాయణ, సిరా జోజి బాబు, సెయింట్ ఆన్స్ స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ షిబా,ప్రిన్సిపాల్ సిస్టర్ జులియట్, వైస్ ప్రిన్సిపాల్ సిస్టర్ సుబ్రంజలి మరియు శిక్షణ పొంద బోవు మహిళలు పాల్గొన్నారు.