బాలల హక్కులు - సవాళ్ళు అనే అంశంపై PMI సభ్యులకు సదస్సు

బాలల హక్కులు - సవాళ్ళు అనే అంశంపై PMI సభ్యులకు సదస్సు
విశాఖ అతిమేత్రాసనం, మహారాణిపేట లోని పాస్ట్రల్ సెంటర్లో తేది 13-05-2025న బాలల హక్కులు - అవసరతలు - నడిపింపు - సవాళ్ళు అనే అంశం ప్రాధాన్యతగా విశాఖ అతిమేత్రాసన భారత చెరసాల పరిచర్య(PMI) సభ్యులకు ఒక రోజు సదస్సు నిర్వహించబడింది. ప్రిజన్ మినిస్ట్రి విశాఖ అతిమేత్రాసన కో ఆర్డినేటర్ ఫాదర్ ప్రదీప్ MSFS గారి సారధ్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సదస్సులో విశాఖ జిల్లా చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ శ్రీమతి రాధ గారు, విశాఖ డాన్ బోస్కో నవజీవన్ డైరెక్టర్ ఫాదర్ అరుళ్ దాస్ గారు, బాలల హక్కుల పరిరక్షణ నిష్ణాతులు శ్రీ పి. చిట్టిబాబు మాస్టర్ గారు ఈ సదస్సులో ప్రిజన్ మినిస్ట్రి సభ్యులకు తమ బోధనల ద్వారా తర్ఫీదు నిచ్చారు. ఈ కార్యక్రమంలో వైజాగ్ PMI అసిస్టెంట్ ఆర్డినేటర్ సిస్టర్ మేరీ జేమ్స్ గారు, సెక్రటరీ శ్రీ శేషుబాబు గారు, శ్రీమతి నిర్మల మేరీ గారు ,శ్రీ ఫ్రాంకీ గారు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
ఈ సదస్సుకు 30 మంది సభ్యులు హాజరై బాలల పరిరక్షణా గృహాల సందర్శనకు అవసరమైన తర్ఫీదు పొందారని అసిస్టెంట్ కో ఆర్డినేటర్ సిస్టర్ మేరీ జేమ్స్ గారు తెలిపారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer