"పాస్టరల్ ప్రణాళికలను" బలోపేతం చేసిన TCBC కుటుంబ సేవా విభాగం

"పాస్టరల్ ప్రణాళికలను" బలోపేతం చేసిన TCBC కుటుంబ సేవా విభాగం

విశాఖ అతిమేత్రాసనం,రోజ్ హిల్‌(కొండగుడి)లో ఫిబ్రవరి 21న  తెలుగు కాథోలిక పీఠాధిపతుల సమాఖ్య "కుటుంబ సేవ విభాగం" (Family commission) వారు సమావేశాన్ని నిర్వహించారు

తెలుగు ప్రాంతీయ పీఠాధిపతుల సమాఖ్య (TCBC) మరియు  అఖిల భారత పీఠాధిపతుల సమాఖ్య CCBI కుటుంబ సేవ విభాగాల సహకారంతో TCBC రీజినల్ సెక్రటరీ గురుశ్రీ మరిపి ప్రతాప్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది .

ఈ కార్యక్రమంలో ఏలూరు పీఠాధిపతులు, విశాఖ అతిమేత్రసన పాలనాధికారి మహా పూజ పొలిమేర జయరావు గారు పాల్గొని కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

"కుటుంబ పరిచర్యను నూతన శక్తితో ముందుకు తీసుకెళ్లమని ప్రోత్సహిస్తూ, తన పూర్తి మద్దతును మహా పూజ పొలిమేర జయరావు గారు పునరుద్ఘాటించారు.

CCBI ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గురుశ్రీ  గాలి అరుల్ రాజ్ గారు శ్రీసభ - కుటుంబ పరిచర్య పై అంతర్దృష్టితో కూడిన సెషన్‌ను నిర్వహించారు.కుటుంబ కమిషన్ డైరెక్టర్లు, కార్యదర్శులు మరియు ప్రతినిధుల ముఖ్యమైన బాధ్యతలను ఆయన గుర్తుచేశారు.  పరిచర్య పట్ల వారి నిబద్ధతను మరింతగా పెంచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తొమ్మిది మేత్రాసనాలలోని 24 మంది ప్రతినిధులు  పాల్గొన్నారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer