తెలంగాణ ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ, తెలంగాణ రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు 2024-25 విద్యా సంవత్సరంలో మైనారిటీ విద్యార్థులకు పాఠశాలలు & కళాశాలల్లో ప్రవేశాల కొరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు అని మేనేజింగ్ డైరెక్టర్ TS క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు తెలియచేసారు.
విజయవాడ మేత్రాసనం, ఉంగుటూరు మండలం, పెద అవుటపల్లి లో బ్రదర్ జోసఫ్ తంబి గారి 79వ వర్ధంతి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 4వ తేదీ నుండి జరుగుతున్న నవదిన ప్రార్ధనలు 12 శుక్రవారం రాత్రితో ముగిసాయి.
కర్నూలు మేత్రాసనం, నంద్యాల జిల్లా, మంచాలకట్ట విచారణ, జనవరి 14 వ తేదీన దివ్యబాల యేసు పండుగ పురస్కరించుకొని విచారణ గురువులు గురుశ్రీ తోట జోసఫ్ గారు 12,13 యువతీయువకులకు వాలిబాల్ పోటీలు నిర్వహించారు.