150వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న సొసైటీ ఆఫ్ ది డివైన్ వర్డ్

రోమ్ లో పోంటిఫికల్ గ్రెగోరియన్ విశ్వవిద్యాలయంలో సొసైటీ ఆఫ్ ది డివైన్ వర్డ్ (SVD) 150 సంవత్సరాల జ్ఞాపకార్థంగా అంతర్జాతీయ సమావేశం మార్చి 27 నుండి 29 వరకు జరిగింది  

ఈ సమావేశానికి ప్రపంచవ్యాప్తంగా 200 పైగా మిషనరీ పండితులు, వేదాంతవేత్తలు, మరియు వేదాంతశాస్త్ర అభ్యాసకులు హాజరయ్యారు.

ఈ సమావేశం వేదాంత అంతర్దృష్టి మరియు శ్రీసభ ప్రేషితకార్యంలో నైతిక ప్రతిచర్యలపై  "Missio Dei in Today’s World "ఇతివృత్తంతో ఆధునికత వల్ల సంతరించుకొన్న సవాళ్లు, సంస్కృతులు మరియు మతాల ద్వారా ప్రేరణ పొందడంపై ద్రుష్టి సారించారు.

చికాగోలోని కాథలిక్ థియాలజికల్ యూనియన్‌లో ప్రొఫెసర్ ఎమెరిటస్ అయిన గురుశ్రీ స్టీఫెన్ బెవాన్స్, SVD, త్రియేక దేవుని దీవెనలు మరియు ప్రేమ అందరిమీద ఉండాలి ప్రార్థిస్తూ ఈ సమావేశాన్ని ప్రారంభించారు.

డికాస్టరీ ఫర్ ది ఎవాంజెలైజేషన్ ప్రో-ప్రిఫెక్ట్ కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే ప్రారంభ ప్రసంగంలో మిషనరీ స్ఫూర్తిని పెంపొందించాలని, క్రీస్తు ప్రభువు పునరుత్థానమై తన శిష్యులకు కనిపించిన సువార్త దృశ్యాన్ని గుర్తుచేసారు.

తన వాక్కు వింటూ, అనుసరిస్తూ మరియు ప్రపంచ నలుమూలల సువార్త ప్రచారం చేయడానికి ప్రభువు ఆహ్వానిస్తున్నారు అని కార్డినల్ టాగ్లే అన్నారు