సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్‌కు కళాత్మక నివాళి

సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్‌కు కళాత్మక నివాళి

సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క అవశేషాల యొక్క దశాబ్దాల ప్రదర్శనతో పాటు, గోవా మరియు డామన్ ఆర్చ్ డియోసెస్ 2024 నవంబర్ 17న పాత గోవాలోని సెయింట్ జాన్ ఆఫ్ గాడ్ యొక్క చారిత్రాత్మక కాన్వెంట్‌లో "ఫుట్‌ప్రింట్స్ ఆఫ్ హోప్" పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంబించారు. గోవా మరియు డామన్ అగ్రపీఠాధిపతులు  మహా పూజ్య కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో గారు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.

ఎగ్జిబిషన్‌లో 62 మంది క్రైస్తవ మరియు హిందూ కళాకారుల రచనలు ఉన్నాయి మరియు 16వ శతాబ్దంలో ఆసియా అంతటా సువార్త ప్రచారం కోసం పనిచేసిన గురువుల వారసత్వాన్ని తెలియజేస్తుంది. ఓల్డ్ గోవాలో నవంబర్ 17న ఈ ప్రదర్శన ప్రారంభమైంది.

సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క అవశేషాల ప్రదర్శన నవంబర్ 21, 2024 నుండి జనవరి 5, 2025 వరకు జరగనున్నది.

వివిధ మతాలకు చెందిన వ్యక్తుల పవిత్ర మరియు లౌకిక కళల ప్రదర్శనలు, సాంస్కృతిక మరియు రాజకీయ కాన్వాస్‌గా పనిచేశాయని మహా పూజ్య కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో గారు అన్నారు.

మహా పూజ్య కార్డినల్ ఫిలిప్ నెరి ఫెర్రో గారు కళాకారులను సత్కరిస్తూ, “మీ సృజనాత్మక ప్రతిభ, మీ గొప్ప వారసత్వ కళ మరియు వారసత్వాన్ని కాపాడుకోవడానికి మీరు చేస్తున్న కృషి అభినందించదగినది అని అన్నారు.

"ఈ ప్రదర్శన భారతీయ నాగరికతను గుర్తించే మత మరియు సాంస్కృతిక వైవిధ్యం పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి సందర్శకులను ప్రేరేపిస్తుంది" అని జెస్యూట్ చరిత్రకారుడు, గోవాలోని జేవియర్ సెంటర్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్ మాజీ డైరెక్టర్ మరియు ఎగ్జిబిషన్ క్యూరేటర్ గురుశ్రీ  డెలియో మెండోంకా గారు అన్నారు.

మరో హిందూ కళాకారుడు, సాగర్ నాయక్ ములే గారు మాట్లాడుతూ, తన పాత గోవా పర్యటన సందర్భంగా, అతను సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క ఆశీర్వాదాలను తీసుకున్నానని,  మరియు సెయింట్ జీవితంపై  తాన పెయింటింగ్‌ను రూపొందించడానికి తన స్వంత పరిశోధన చేశానన్నారు.

ఈ కార్యక్రమంలో గోవా మరియు డామన్ సహాయక పీఠాధిపతులు మహా పూజ్య సిమియో ప్యూరిఫికాకో ఫెర్నాండెజ్, ఎక్స్‌పోజిషన్ కమిటీ కన్వీనర్ గురుశ్రీ  హెన్రీ ఫాల్కావో, అలాగే క్యూరేటర్‌లు మరియు సహకరిస్తున్న కళాకారులు కూడా పాల్గొన్నారు.

Article and Design By

M. Kranthi Swaroop

RVA Telugu Online Content Producer