సెయింట్ పాట్రిక్స్ పాఠశాలలో "ఇన్వెస్టిచర్ వేడుక - 2025"

సెయింట్ పాట్రిక్స్ పాఠశాలలో "ఇన్వెస్టిచర్ వేడుక - 2025"  

సికింద్రాబాద్   లోని సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్ నందు "ఇన్వెస్టిచర్ వేడుక - 2025" మార్చి 28,2025  న   ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ గురుశ్రీ ఎలాంగో గారు, స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గురుశ్రీ ఆండ్రూ గారు మరియు  స్కూల్ కరెస్పాండంట్ గురుశ్రీ దూసి రవి శేఖర్ గారు  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  శ్రీ నరేంద్రర్ నారాయణ్ రావు చుంఘి గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. నాయకులుగా ఎన్నుకోబడిన విద్యార్థులకు  శ్రీ నరేంద్రర్ నారాయణ్ రావు గారు అభినందించారు. గురుశ్రీ ఎలాంగో గారు మాట్లాడుతూ "విద్యార్థులలో నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడం వారి సమగ్ర అభివృద్ధికి మరియు భవిష్యత్తు విజయానికి చాలా అవసరం" అని  అన్నారు.  

పిల్లలందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. టీచర్స్ తో పాటు  పిల్లల తల్లిదండ్రులు ఆనందంగా గడిపారు. 

Design and Article By
M Kranthi Swaroop
RVA Telugu Online producer