సెయింట్ థెరిస్సా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

సెయింట్ థెరిస్సా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

సెయింట్ థెరిసా హాస్పిటల్ - శంషాబాద్ శాఖ (St.Theresa's Hospital - Shamshabad) వారి ఆధ్వర్యంలో శంషాబాద్ సమీపంలోని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ సమీపంలోని దాదాపు 43 గ్రామాలలో ఈ వైద్య సేవలను అందిస్తున్నట్లు  హాస్పిటల్ పాలనాధికారి(Administrator) సిస్టర్ తోమాసమ్మ గారు తెలిపారు.

ఎయిర్పోర్టు కాలనీ, శంషాబాద్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాలనీలో ప్రతి ఒక్కరికి నిపుణులైన వైద్యుల సమక్షంలో  వైద్య పరీక్షలు నిర్వహించారు. నర్సింగ్ స్టాఫ్  తమ వంతు సహకారాన్ని అందించారు.

దాదాపు 100 మందికి  వైద్య పరీక్షలు మరియు ఉచిత మందులను అందించారు.  వైద్య పరీక్షలలో భాగంగా బిపి, షుగరు, ఇతర  వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ కార్యక్రమములో సిస్టర్ దివ్య గారు పాల్గొన్నారు. శంషాబాద్ సమీపంలోని గ్రామాల్లో సెయింట్ థెరిసా హాస్పిటల్ - శంషాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో  ఉచిత  వైద్య సేవలు కొనసాగుతాయని సిస్టర్ తెలిపారు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer