రెండవ జాతీయ యూకరిస్టిక్ కాంగ్రెస్ కు తన ఆశీర్వాదాలను అందించిన పొప్ ఫ్రాన్సిస్
డిసెంబర్ 4 నుండి 8 వరకు రువాండాలో జరిగిన రెండవ జాతీయ యూకరిస్టిక్ కాంగ్రెస్ లో పాల్గొన్న వారి పనిని పోప్ ఫ్రాన్సిస్ ప్రోత్సహిస్తున్నట్లు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్డినల్ పియట్రో పరోలిన్ సంతకం చేసిన సందేశంలో పేర్కొన్నారు.
దివ్యసత్ప్రసాద ద్వారా నిరీక్షణ మరియు శాంతి నెలకొనాలని తన ఆశీర్వాదాలు, ప్రార్థనలు మరియు ప్రోత్సాహాన్ని రువాండా ప్రజలకు పంపిన పొప్ ఫ్రాన్సిస్
రుహెంగేరి పీఠాధిపతులు, రువాండా ఎపిస్కోపల్ కాన్ఫరెన్స్ (CEPR) ప్రతినిధి అయిన మహా పూజ్య విన్సెంట్ హరోలిమనాను ఉద్దేశించి చేసిన సందేశంలో ఆఫ్రికన్ దేశంలోని క్రైస్తవ విశ్వాసులందరి "సంతోషం" మరియు "ధన్యవాదాలు" తెలియపరిచారు.
దివ్యసత్ప్రసాదం క్రైస్తవ జీవితాల ముఖ్య కేంద్రంగాను, క్రీస్తు ప్రేమకు స్పష్టమైన సంకేతంగా ప్రతిబింబించే అవకాశాన్ని ఈ యూక్లిస్టిక్ కాంగ్రెస్ అందిస్తుంది అని అన్నారు
2025 జూబిలీకి మరియు రువాండా సువార్తీకరణ 125వ వార్షికోత్సవానికి సన్నాహకంగా, "మన నిత్య ఆహారమైన క్రీస్తు ప్రభువుకు చేరువ కావాలని ప్రోత్సహించారు, దుర్బల పరిస్థితిలో ఎవరికైనా సంఘీభావం తెలపాలని ఆయన కోరారు.
మానవాళి భౌతిక మరియు ఆధ్యాత్మిక అవసరాల పట్ల భాగస్వామ్య బాధ్యత కోసం పిలుపునిస్తూ ఆ త్రియేక దేవుని దీవెనలు అందరిపై ఉండాలి అని పోప్ ఫ్రాన్సిస్ ముగించారు