మయన్మార్‌లో సమ్మిళిత చర్చలకు పిలుపునిచ్చిన పొప్ ఫ్రాన్సిస్
పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం, నవంబర్ 24, త్రికాల ప్రార్ధన సమయంలో సంఘర్షణతో బాధపడుతున్న దేశాలలో హింసను నిలిపివేయాలని ప్రార్థనలు చేశారు.
చిత్తశుద్ధితో కూడిన, సంఘటిత సంభాషణను శాశ్వత శాంతి మార్గం దిశగా కొనసాగించాలని, ఆయుధాలు పక్కనపెట్టి, సయోధ్య దిశగా సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మయన్మార్ ప్రజలకు, ప్రత్యేకించి అత్యంత బలహీనమైన పిల్లలకు, వృద్ధులకు, శరణార్థులకు పోప్ గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నవంబర్ 25, 1920 న జరిగిన మొదటి విశ్వవిద్యాలయ విద్యార్థుల సమ్మె వార్షికోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ స్వతంత్రం దిశగా మయన్మార్ చారిత్రక ప్రయాణం గురించి మాట్లాడారు.
పోప్ ఫ్రాన్సిస్ గారు ఉక్రెయిన్, పాలస్తీనా, ఇజ్రాయెల్, లెబనాన్ మరియు సూడాన్‌తో సహా యుద్ధం జరుగుతున్న ప్రాంతాల శాంతి కొరకు ప్రార్థనలను కోరారు.
హింసను అధిగమించడానికి మరియు సామరస్య భవిష్యత్తును నిర్మించుకోవడానికి అవసరమైన సంభాషణ మరియు సహకారంతో శాంతి నెలకొల్పవచ్చు అని పొప్ గారు పునరుద్ఘాటించారు.
.