మచిలీపట్టణంలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

మచిలీపట్టణంలో భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
విజయవాడ మేత్రాసనం, మచిలీపట్టణం, పవిత్ర సిలువ దేవాలయం (Holy Cross Church)లో గుడ్ ఫ్రైడే (పరిశుద్ద శుక్రవారం) సందర్భముగా పరిశుద్ద స్లీవ మార్గం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు ఫాదర్ ఎన్. డేవిడ్ రాజు గారి ఆధ్వర్యంలో పరిశుద్ద శుక్రవార సాంగ్యాలు ఆద్యంతం భక్తిశ్రద్ధలతో జరిగాయి.
సిలువ పై యేసు ప్రభువు వారు ఉన్న ప్రతిమను వాహనంపై ఉంచి నగర పురవీధులలో ప్రదక్షణగా శాంతి ర్యాలీని నిర్వహించారు. విచారణ ప్రజలు , గురువులు, సిస్టర్స్ , యువతీ యువకులు ఫాదర్ ఎన్. డేవిడ్ రాజు గారిని అనుసరిస్తూ ప్రభు యేసుని సిలువ పాట్లను గుర్తు చేసుకున్నారు.
ఫాదర్ ఎన్. డేవిడ్ రాజు గారు ప్రభు యేసుని ప్రేమను, కరుణను లోకానికి చాటి చెప్పుతూ ... నీకోసం, నాకోసం మరణించి సిలువపై వేలాడుతున్న యేసుప్రభును చూడమని నగర ప్రజలను ప్రేమతో కోరారు. అధికసంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేవాలయం చేరుకున్నాక ఫాదర్ ఎన్. డేవిడ్ రాజు గారు పరిశుద్ద శుక్రవారం యొక్క ప్రాముఖ్యతను , యేసు ప్రభువారి విధేయతను ,ధైర్యాన్ని ,ప్రేమను ప్రజలకు తెలియజేసారు.
Article and Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer