ప్రభువే మనకు నిత్యజీవానికి మార్గమన్న పోప్

నవంబర్ 2 ఆదివారం సకల ఆత్మల స్మరణ రోజున రోమ్‌ నగరంలోని Verano స్మశానవాటికలో విశ్వాసుల జ్ఞాపకార్థం పోప్ లియో దివ్యబలిపూజను సమర్పించారు.

మరణం ఈ ఇహలోకపు జీవితానికి ముగింపు మాత్రమే కానీ, అది పరలోక జీవితానికి ఆరంభము  అని పోప్ గుర్తుచేసారు. క్రీస్తు పునరుత్థానం ద్వారా మరణాన్ని జయించినట్లే మనంకూడా  ఆ పరలోకంలో నూతన జీవితాన్ని పొందుతాం అని అయన అన్నారు 

మరణించిన మన ఆత్మీయుల కొరకు దుఃఖించకుండా  ప్రేమతో, విశ్వాసముతో స్మరించాలని, ప్రార్థనలు,దానధర్మాలు చేయాలని అన్నారు 

మృతులు మనతో లేకపోయినా దేవునితో ఉన్నారు అని విశ్వసించాలి.  మరణించిన మన కుటుంబ సభ్యులను, బంధువులను క్రీస్తు చేతికి అప్పగిస్తూ,పునరుత్థాన క్రీస్తు వైపు మన దృష్టిని నిలపాలని పోప్ తన ప్రసంగాన్ని ముగించారు.