ప్రపంచ విద్యా జూబ్లీని ప్రారంభించిన పోప్
అక్టోబర్ 27 సోమవారం సెయింట్ పీటర్స్ బసిలికా నందు పోప్ లియో పాంటిఫికల్ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో దివ్యబలి పూజ సమర్పించారు
విశ్వవిద్యాలయ సంస్థలలో భాగమైన వారిని మరియు వివిధ మార్గాల్లో అధ్యయనం, బోధన మరియు పరిశోధన చేస్తున్న వారందరినీ ఉద్దేశించి పోప్ మాట్లాడారు
ప్రపంచ విద్యా జూబ్లీ దివ్యబలిపూజతో ప్రారంభించబడింది.
విద్య అనేది ఒక వ్యక్తి మరియు వారి జీవిస్తున్న సమాజం రెండింటికీ అవసరమని, దాని విలువ గురించి పోప్ మాట్లాడరు
లూకా సువార్తలో రాయబడినట్లు పదునెనిమిది ఏండ్లనుండి బలహీన పరచు దయ్యము పట్టిన స్త్రీకి స్వస్థత కలిపించిన సువార్త వృత్తాంతాన్ని పోప్ఉదాహరణగా అందించారు
విద్య ఈ సువార్తలో వివరించబడిన అద్భుతాన్ని పోలి ఉంటుంది వంగిపోయిన స్త్రీ ని యేసు స్వస్థపరచినట్లుగా విద్య మానవుని నిలబడటానికి సహాయం చేస్తుంది
చదువుకున్న వారు మాత్రమే "బోధించడం, రూపొందించడం మరియు "మరొకరి చేయూతనివ్వడంలో సహాయపడతారు అని పోప్ అన్నారు
దివ్య బలిపూజ అనంతరం Gravissimum Educationis అనే సయోధ్య ప్రకటన 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాసిన "sketching New Maps of Hope" అనే అపోస్టోలిక్ లేఖపై పోప్ సంతకం చేశారు.