నెమ్మికల్, క్రీస్తురాజు దేవాలయ వార్షిక మహోత్సవం

నల్గొండ మేత్రాసనం,నెమ్మికల్ గ్రామంలో క్రీస్తురాజు దేవాలయ వార్షిక మహోత్సవం ఫిబ్రవరి 27 ,2025 న ఘనంగా జరిగింది
నల్గొండ పీఠాధిపతులు మహా పూజ్య కరణం ధమన్ కుమార్ గారు పాల్గొని ఇతర గురువులతో కలసి దివ్య పూజాబలిని సమర్పించారు.
ఈ దివ్య పూజలో 7 మంది చిన్నారులు మాన్యులు కరణం ధమన్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రధమ దివ్యసత్ప్రసాదాన్ని మరియు 20 మంది భద్రమైనఅభ్యంగనము సీకరించారు.
విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.
ఈ మహోత్సవం క్రీస్తురాజు దేవాలయ విచారణ కర్తలు గురుశ్రీ పి అలెగ్జాండర్ మరియు తోటి విచారణ కర్తలు గురుశ్రీ జి కిరణ్ గారి ఆధ్వర్యంలో జరిగింది.