నూతన నియామకం
ఫ్రాన్సిస్ పాపు గారు మే 11,2024 న ఉత్తరప్రదేశ్, ఝాన్సీ మేత్రాసనం సహాయక పీఠాధిపతిగా లక్నోకి చెందిన గురుశ్రీ విల్‌ఫ్రెడ్ గ్రెగరీ మోరాస్ (55)ని నియమిస్తూ ప్రకటించారని తెలియచేయుటకు సంతోషిస్తున్నాం.
ప్రస్తుతం తను అలహాబాద్ మేత్రాసనంలోని సెయింట్ జోసఫ్స్ రీజినల్ సెమినరీకి రెక్టర్ గా ఉన్నారు.
గురుశ్రీ విల్ఫ్రెడ్ గ్రెగొరీ మోరాస్ 13 ఫిబ్రవరి 1969న మంగళూరు మేత్రాసనం నీరూడేలో జన్మించారు మరియు సెయింట్ జోసఫ్స్ రీజినల్ సెమినరీలో తత్వశాస్త్రం మరియు వేదాంతశాస్త్రం అభ్యసించారు
అతను 27 ఏప్రిల్ 1997న లక్నో మేత్రాసన గురువుగా అభిషేకింపబడ్డారు.
(1997-1999) - లక్నోలోని సెయింట్ పాల్స్ మైనర్ సెమినరీలో శిక్షకుడుగా
(1999-2002)- పీఠాధిపతి కార్యదర్శిగా
(2002-2003)-పాలియాలోని సెయింట్ ఆన్స్ స్కూల్ వైస్ ప్రెసిడెంట్ గా
(2003-2006)-రోమ్‌లోని పొంటిఫికల్ అర్బన్ యూనివర్శిటీలో మిసియాలజీలో బ్యాచిలర్ ఆఫ్ స్టడీస్
(2007-2008)-నిగోహాన్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ మరియు హాస్టల్ చైర్మన్ మరియు డైరెక్టర్ గాను
(2008-2013) - బారాబంకిలోని సెయింట్ ఆంథోనీస్ స్కూల్ చైర్మన్ గా
(2013-2016) - రోమ్, పొంటిఫికల్ అర్బన్ విశ్వవిద్యాలయంలో మిస్సియాలజీలో డాక్టరేట్
(2017-2021)-వారణాసిలోని నవ్ సాధన ప్రాంతీయ పాస్టోరల్ సెంటర్ డైరెక్టర్
2021 నుండి అలహాబాద్‌లోని సెయింట్ జోసఫ్ ప్రాంతీయ సెమినరీకి రెక్టర్‌గా తన సేవలు ఉన్నారు.