నల్గొండలో జూబ్లీ 2025 ప్రారంభ వేడుకలు
డిసెంబర్ 29, 2024న, మరియ రాణి కేథడ్రల్‌లో నల్గొండ పీఠకాపరులు మహా పూజ్య ధమన్ కుమార్, MSFS, అధికారికంగా జూబ్లీ 2025 సంవత్సరాన్ని ప్రారంభించారు.
మేత్రాసన ఛాన్సలర్ గురుశ్రీ అంబటి ఆర్ల, గురుశ్రీ ఆర్లగడ్డ జోసఫ్, జూబ్లీ కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి; గురుశ్రీ T. జోసఫ్, మరియా రాణి కథడ్రల్ విచారణ గురువులు; ఇతర గురువులు,మఠ కన్యలు మరియు విశ్వాసులు ఈ జూబిలీ ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు .
జూబ్లీ సంవత్సర ఇతివృత్తంగా నిరీక్షణ ప్రాముఖ్యతను పీఠాధిపతులవారు తమ స్ఫూర్తిదాయకమైన ప్రారంభ ప్రసంగం చేసారు మరియు కుటుంబాలు వారి దైనందిన జీవితంలో క్రైస్తవ విలువలను స్వీకరించాలని మరియు ఆచరించాలని పిలుపునిచ్చారు .
గురుశ్రీ ఆర్లగడ్డ జోసఫ్ గారు జూబ్లీ సిలువను ఊరేగింపుగా, మేళతాళాలతో ఊరేగించారు.