ఉచిత వైద్యం.. సేవే ప్రధానం

ఉచిత వైద్యం.. సేవే ప్రధానం

సెయింట్ థెరిసా హాస్పిటల్ - శంషాబాద్ శాఖ (St.Theresa's Hospital - Shamshabad) వారి ఆధ్వర్యంలో శంషాబాద్ సమీపంలోని గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం కొనసాగుతోంది. సెయింట్ థెరిసా హాస్పిటల్ పాలనాధికారి(Administrator) సిస్టర్ తోమాసమ్మ గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.

నవంబర్ 13 బుధవారంనాడు శంషాబాద్ సమీపంలోని చౌదరిగూడలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనగా పలువురికి షుగర్,బీపీ ఇతర  పరీక్షల నిర్వహించి వైద్యులు పలు సూచనలు చేశారు. దాదాపు 100 మందికి  వైద్య పరీక్షలు మరియు ఉచిత మందులను అందించారు.  

ఈ సందర్భంగా సిస్టర్ తోమాసమ్మ గారు  మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇలాంటి వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

శంషాబాద్ సమీపంలోని గ్రామాల్లో సెయింట్ థెరిసా హాస్పిటల్ - శంషాబాద్ శాఖ వారి ఆధ్వర్యంలో "సేవే ప్రధానంగా ఈ ఉచిత  వైద్య సేవలు" కొనసాగుతాయని  సిస్టర్ తోమాసమ్మ గారు తెలిపారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer