జపాన్ లోని భూకంప బాధితులకు సంతాపాన్ని తెలిపిన ఫ్రాన్సిస్ పాపు గారు
జనవరి 1 సోమవారం సాయంత్రం జపాన్ లో సంభవించిన ఘోరమైన భూకంపంలో మరణించిన 48 మంది గూర్చి పోప్ ఫ్రాన్సిస్ జపాన్ ప్రజలకు తన సంతాపాన్ని వ్యక్తం చేసారు.
వాటికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, కార్డినల్ పియట్రో పెరోలిన్ ద్వారా పంపిన టెలిగ్రామ్లో, ఆయన తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపాన్ని తెలిపాడు, "
ఈ భూకంపం తీవ్రత 7.6గా నమోదైంది మరియు జపాన్ సముద్ర తీరంలోని కొన్ని ప్రాంతాలలో ఒక మీటరు మేర అలలు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని, దీంతో నివాసితులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు.
విపత్తులో నష్టపోయిన వారందరికీ ఫ్రాన్సిస్ పాపు గారు పలు విధాలుగా తన మద్దతును తెలిపారు. మృతులు మరియు బాధలో మిగిలిపోయిన వారి కోసం, అలాగే తప్పిపోయిన వారి రక్షణ కోసం ప్రత్యేక ప్రార్థనలు జరపాలని పాపు గారు పిలుపునిచ్చారు.