ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అలర్ట్

ఏపీ, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు అలర్ట్

తూర్పు భారత రాష్ట్రాలను వేడిగాలులు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యంగా ఒడిశా, పశ్చిమబెంగాల్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల సెల్సియస్‌ పెరిగినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో 43.5 డిగ్రీల సెల్సియస్‌, కర్నూలులో 43.2 డిగ్రీల సెల్సియస్‌ నమోదుకాగా, తమిళనాడులోని సేలంలో 42.3 డిగ్రీల సెల్సియస్‌, ఈరోడ్‌లో 42 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు తెలిపారు.

ఏప్రిల్ ప్రారంభం నుంచే దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఈ నెలలో ఇలా వేడిగాలుల విజృంభించడం ఇది రెండోసారి. తీరప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, అస్సాం, మేఘాలయ, త్రిపుర, బిహార్‌ రాష్ట్రాల్లో అధిక తేమతో ప్రజలు అసౌకర్యానికి గురవుతారని ఐఎండీ తెలిపింది.అయితే IMD అంచనా వేసినట్లుగా కొన్ని తూర్పు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఒడిశాలో ఏప్రిల్‌ 25 నుంచి 27 తేదీల్లో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అధికంగా ఉంటాయని ఐఎండీ వివరించింది.ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఉంటాయని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్నారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer