హింసతో భవిష్యత్తు లేదన్న పోప్ లియో

సెప్టెంబర్ 21 ఆదివారం పాపల్ ప్యాలెస్ నుండి మధ్యాహన త్రికాల ప్రార్ధన అనంతరం ప్రతీ వ్యక్తి వారివారి జీవితాలకు జవాబుదారీతనం వహించాల్సి వస్తుంది అని పోప్ అన్నారు 

మనం జీవిస్తున్న ఈ జీవితం కానీ ఈ లోకపు వస్తువులకు మనం యజమానులం కాదు; ప్రతిదీ ఆ ప్రభువు నుండి బహుమతిగా అందుకున్నవే. వీటిని ఆ దేవుడు తన వారసత్వంగా మనకు అందించి మన సంరక్షణకు, మన స్వేచ్ఛ మరియు బాధ్యతకు అప్పగించారు అని పోప్ అన్నారు 

తన ప్రసంగం ముగింపులో, యుద్ధ హింసతో బాధపడుతున్న వారందరినీ గుర్తుంచుకోవాలని మరియు వారి కోసం ప్రార్థనలు చేయమని పోప్ పిలుపునిచ్చారు.

హింస, బలవంతపు బహిష్కరణ, ప్రతీకారం ఆధారంగా భవిష్యత్తు లేదు అని పోప్ అన్నారు 

ప్రజలకు శాంతి అవసరం; వారిని నిజంగా ప్రేమించే వారు శాంతి కోసం కృషి చేస్తారు.

యుద్ధం నిజమైన లేదా శాశ్వత భవిష్యత్తును తీసుకురాలేదని గుర్తుచేస్తూ పోప్ ముగించారు