శాంతి కొరకు జపమాలను జపించమన్న పోప్ లియో

యుద్ధంతో దెబ్బతిన్న దేశాలలో శాంతి నెలకొనాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కతోలికులందరు అక్టోబర్ మాసమంతా జపమాలను జపించాలని బుధవారం సెప్టెంబర్ 24 న జరిగిన సామాన్య ప్రేక్షకుల సమావేశంలో పోప్ లియో పిలుపునిచ్చారు
రోమ్‌లోని విశ్వాసులు అక్టోబర్ 11, 2025న సాయంత్రం 6:00 గంటలకు సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో సమావేశమవుతారని ఆయన అన్నారు
మరియమాత జూబిలీ వేడుకలో భాగంగా వాటికన్ సిబ్బంది ఈ నెల మొత్తం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగే జపమాల ప్రార్థన కు హాజరవాలి అని పోప్ అన్నారు
అక్టోబర్ 11 న ఫాతిమా మాత స్వరూపము మరియమాత జూబిలీ వేడుకలో భాగంగా సెయింట్ పీటర్స్ స్క్వేర్‌కి తీసుకురానున్నారు
క్రీస్తు ప్రేమను పంచుతూ,మానవత్వాన్ని వెలుగులోకి తీసుకురావాలని పోప్ పిలుపునిచ్చారు