రోమన్ క్యూరియా కొత్త నియమావళిని విడుదల చేసిన వాటికన్
Apostolic Constitution "Praedicate Evangelium." ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణలకు అనుగుణంగా రూపొందించిన రోమన్ క్యూరియా కొత్త నియమావళిని ప్రచురించేందుకు పోప్ లియో అనుమతి ఇచ్చారు.
రోమన్ క్యూరియా మరియు దాని సిబ్బందికి సంబంధించిన ఈ సవరించిన నిబంధనలు నవంబర్ 24, సోమవారం విడుదలయ్యాయి.
ఈ నియమాలు పత్రం నవంబర్ 23, ఆదివారం క్రీస్తు రాజు మహోత్సవం నాడు పోప్ లియో చేత సంతకం చేయబడ్డాయి.
రోమన్ క్యూరియా నియమావళి రోమన్ క్యూరియాను రూపొందించే సంస్థలు మరియు కార్యాలయాలకు అనగా సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్, డికాస్టరీలు, న్యాయ సంస్థలు మరియు ఆర్థిక సంస్థలకు వర్తిస్తుంది
సంస్థలలో పనిచేసే సిబ్బందికి సంబంధించిన వ్యవస్థాపక, క్రమశిక్షణాత్మక మరియు ఆర్థిక నిబంధనలను ఈ నియమావళి నిర్వచిస్తుంది.
ఈ నూతన నియమాలు రెండవ జాన్ పాల్ పోప్ ఏప్రిల్ 15, 1999న ఆమోదించిన మరియు అదే సంవత్సరం జూలై 1న అమల్లోకి వచ్చిన నియమావళికి బదులుగా వస్తున్నాయి.
ఇవి దివంగత పోప్ ఫ్రాన్సిస్ గారు మార్చి 19, 2022న విడుదల చేసిన Praedicate Evangelium ద్వారా ప్రవేశపెట్టిన మార్పులు.